Nag Vamsi: మూవీ కలెక్షన్స్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగ వంశి..! 6 d ago
రూ. 250 పెట్టి టికెట్ కొంటే నిర్మాతకు ఎంత మిగులుతుంది.మూవీ కలెక్షన్స్ పరంగా కనిపించే ఈ గ్రాస్, నెట్, షేర్ గురించి నిర్మాత నాగ వంశి క్లారిటీ ఇచ్చారు. " థియేటర్స్ లో టికెట్స్ అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని గ్రాస్ అని అంటారు. అందులో ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ పోగా మిగిలింది నెట్ కలెక్షన్స్ అంటారు. వీటిలో ఎగ్జిబిటర్లు, థియేటర్స్ పర్సెంటేజ్ కట్ చేయగా ఫైనల్ గా నిర్మాతకి వచ్చేదాన్ని షేర్ అంటారు. మీరు రూ. 250 పెట్టి టికెట్ కొంటే దానిలో నిర్మాతకు వచ్చేది రూ. 100 మాత్రమే అని నాగ వంశి వివరణ ఇచ్చారు.